WhatsApp Image 2024 08 21 at 14.08.19
Mattelu sari is given as a financial aid for the marriage of a poor girl
పేదింటి అమ్మాయి పెళ్ళికి ఆర్థిక సహాయంగా పుస్తే మట్టెలు చీర మరియు 54,230/- రూపాయలు 50 కిలోల బియ్యం అందించిన స్వర్ణకార సంఘం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఎల్బీనగర్ నిరుపేద కుటుంబానికి చెందిన స్వర్ణకారుడైన సిరికొండ వెంకటేశ్వర్లు బంగారు పనులు తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులతో కూతురు వివాహం సహాయార్థమై స్థానిక రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ ను సంప్రదించడంతో, వారు స్థానిక స్వర్ణకారుల సహకారంతో 54,230/- రూపాయలు 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు మరియు వారి కమిటీ సభ్యుల సహకారంతో పుస్తె మెట్టెలు పెళ్లి చీర అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం కోశాధికారి కట్ట శ్రీధరాచారి, ఉపాధ్యక్షులు శ్రీరామోజు జగన్, గాలిపెళ్లి రమేష్ సహాయ కార్యదర్శి కందుకూరి రాజు, మరియు కమిటీ సభ్యులు, స్థానిక స్వర్ణకారులైన దేవరకొండ శ్రీను, దేవరకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
