గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని పెందోర్ ధర్మ్ మహా పాదయాత్ర

TRINETHRAM NEWS

Pendor Dharma Maha Padayatra to provide infrastructure in villages

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని పెందోర్ ధర్మ్ మహా పాదయాత్ర…!

సంఘీభావం ప్రకటించిన ‘ఖని’ నాయకులు..

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఆదివాసి పల్లెల్లో కనీస మౌలిక వసతులు విద్య వైద్యం రోడ్లు డ్రైనేజీలు వ్యవస్థ కల్పించాలని, అలాగే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆదివాసి బిడ్డ పెందోర్ ధర్మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహాయా పాదయాత్ర ప్రారంభించారు.

ఇందులో భాగంగా గోదావరి ఖని కి చెందిన భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శీలం శ్రీనివాస్ ముదిరాజ్, ఎంబీసీ నాయకులు, న్యూ ఇండియా పార్టీ నాయకులు సోమవారం మహా పాదయాత్ర చేస్తున్న ధర్మ్ కు ఘనంగా స్వాగతం పలికారు శాలువాతో సన్మానించి శాంతియుతంగా చేస్తున్న ఆయన పాదయాత్రను అభినందించారు. ముఖ్యమంత్రి పల్లెల్లో , పట్టణాల్లో అభివృద్ధి మౌలిక వసతులు కల్పించాలని ధర్మ్ కు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజుసేన, jv రాజు వేముల అశోక్, నిరటి శంకర్, జోడు సదానందం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pendor Dharma Maha Padayatra to provide infrastructure in villages

You cannot copy content of this page

Scroll to Top