జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 07 at 16.30.07

TRINETHRAM NEWS

KTR warns those who are making baseless propaganda about BRS party

దుష్ప్రచారాలు చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు వ్యక్తులకు కేటీఆర్ హెచ్చరికలు.

బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు.

24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు కుతంత్రాలు కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది..

KTR On X: భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరికలు చేసారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసారు కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు చేసారు.

బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని., 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది.. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్ఎస్ అంటూ అన్నారు.

సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపాము. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది.., ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలి.. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR warns those who are making baseless propaganda about BRS party

You cannot copy content of this page