జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 05 at 14.29.37

TRINETHRAM NEWS

Minister Ponguleti Srinivas Reddy laid the foundation stone along with Legislative Assembly Speaker Gaddam Prasad Kumar

Trinethram News : వికారాబాద్ జిల్లా

వికారాబాద్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయిల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలసి శంకుస్థాపన చేశారు

వికారాబాద్ నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పర్యటించి 60 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన శాసనసభ సభాపతి, మంత్రికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం సభాపతి, మంత్రి పోలీస్ గొరవ వందనాన్ని స్వీకరించారు,

వికారాబాద్ పట్టణం లో 12 కోట్ల వ్యయంతో ఆలంపల్లి నుండి రాళ్లచిట్టంపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం,
6 కోట్ల వ్యయంతో వికారాబాద్ పట్టణ కేంద్రంలో నిర్మించనున్న 4 సూటెడ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం తో పాటు 42 కోట్ల తో మర్పల్లి నుండి కోట్ పల్లి వరకు వివిధ అనుసంధాన రోడ్ల నిర్మాణానలకు శంకుస్థాపనలు గావించారు.

ఈ కార్యక్రమలలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, ఎస్ ఈ వసంత నాయక్ , ఇంచార్జ్ ఇఇ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్మన్ శంషాద్ బేగం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Ponguleti Srinivas Reddy laid the foundation stone along with Legislative Assembly Speaker Gaddam Prasad Kumar

You cannot copy content of this page