జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 01 at 6.48.18 PM

TRINETHRAM NEWS

Anger flares over Telangana CM Revanth Reddy’s comments that brought a Telangana girl to tears in a full assembly.

నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డ ను కంటతడి పెట్టించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల

Trinethram News : కెటీఅర్ పిలుపుతో ప్రగతి నగర్ త్రి మంకీస్ సర్కిల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…

సీఎం రేవంత్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపుతో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఆదేశానుసారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ “త్రి మంకీస్ సెంటర్” అమరవీరుల స్తూపం వద్ద ఎన్ఎంసి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బి అర్ ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, మహిళా నాయకులు, ఎన్ఎంసి బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anger flares over Telangana CM Revanth Reddy's comments that brought a Telangana girl to tears in a full assembly.

You cannot copy content of this page