TRINETHRAM NEWS

Inauguration of Singareni Conservation Mission Wall Poster -CITU

పి. రాజారావు రాష్ట్ర వాధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1, Gdk1&3 ఇంక్లైన్ పిట్ జనరల్ బాడీ సమావేశం దాసరి సురేష్ అధ్యక్షతన జరిగింది, బ్రాంచి అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలోని బొగ్గు బ్లాక్ కులను సింగరేణి కేటాయించాలని, కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు 29న సింగరేణి పరిరక్షణ యాత్ర బెల్లంపల్లిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని, ఆగస్టు 5న కొత్తగూడెం బహిరంగ సభతో ముగుస్తుందని, యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్, ఆశన్న టీం లీడర్స్ గా ఉంటారని,

ఈరోజు రేపు బెల్లంపల్లి మందమరి శ్రీరాంపూర్ ఏరియాలో యాత్ర కొనసాగుతూ జూలై 30 రాత్రి గోదావరిఖని చేరుకుంటుందని, జూలై 31న ఉదయం ఆరు గంటలకు మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ పూలమాలవేసి బైక్ ర్యాలీతో బస్సు యాత్ర బయలుదేరి, జీడికే టూ ఇంక్లైన్లో గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, అక్కనుండి చౌరస్తా చేరుకొని మధ్యాహ్నం జీడికే11, ఇంక్లైన్ లో సెకండ్ షిఫ్ట్ గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సాయంత్రం 5 గంటలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు బహిరంగ సభకు హాజరవుతారని తెలియజేశారు, అనంతరం పిట్ కమిటీ ఎన్నుకోవడంతోపాటు సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దాసరి సురేష్, జి సాయికృష్ణ, ఈ సాగర్, శశి, సానం రవి, నంది నారాయణ, పి సమ్మయ్య, దశరథ రెడ్డి, కే రమేష్, శ్రావణ్, సాగర్, 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inauguration of Singareni Conservation Mission Wall Poster -CITU