WhatsApp Image 2024 07 21 at 16.01.36
All India Ambedkar Youth Association
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని R.K గార్డెన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తదుపరి శిక్షణ తరగతులను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు..
ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
ఆల్ ఇండియా అందేద్కర్ యువజన సంఘం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఒక ఆశయం కోసం మంచి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో ఆనాడు స్వాతంత్రం వచ్చిన తరువాత అంబేద్కర్ గొప్ప గొప్ప మేధావులతో కలిసి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక మతానికో, కులానికో కాకుండా ఈ దేశం నాది ఈ దేశ ప్రజలందరూ నా వాళ్ళు అని దృష్టిలో ఉంచుకొని ఈ దేశ ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతోమంది ప్రధాన మంత్రులుగా, చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాయి, ఎంతోమంది రాష్ట్రపతులు వచ్చారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నాం అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా ఒక కారణం అని అలాగే ఇంజనీరింగ్, పీజీలు చదువుకోని ఉద్యోగల కోసం ఎదురుచూస్తున్న అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ఆల్ ఇండియా యువజన సంఘం ద్వారా ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమన్ని ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు మీ సంఘం ద్వారా చేయూత కలిపించాలని కోరారు. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా తాము ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నార
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
