జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 19.16.21

TRINETHRAM NEWS

Helping students on the occasion of daughter’s birthday

విద్యార్థులకు సహాయ పడమని కోరిన కౌన్సిలర్ విద్యార్థులకు సాయం అందజేసిన సింగరేణి ఉద్యోగి

విద్యార్థులకు సాయం పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్

కొత్తగూడెం అర్బన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కొత్తగూడెం మండల పరిధిలోని చిట్టి రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈరోజు మన తండా వాసి అయిన సింగరేణి బెల్లంపల్లి ఉద్యోగి భూక్య రాంబాబు అశ్వని భాయ్ దంపతుల కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహాయం అందజేస్తూ తమ కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో విద్యార్థులకు బ్యాగులు ఇతర సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది .

ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అలాగే అంగన్వాడి పిల్లలకు సహాయం చేయమని అడగానే తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా సుమారుగా పదివేల రూపాయలతో విద్యార్థిని విద్యార్థులకు కావలసిన బ్యాగులు, పెన్నులు, పెన్సిల్లు, పలకాలు, రబ్బర్లు, చాక్ మార్క్, కం బాక్స్, సామాగ్రిని సహాయం చేసినందుకు పాఠశాల మరియు గ్రామం తరపున సింగరేణి ఉద్యోగి అయిన భూక్య రాంబాబు అశ్విని భాయ్ దంపతుల కూతురు పుట్టినరోజు జరుపుకుంటున్న భూక్య లక్ష్మీ శ్రీ బాయ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తో పాటు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు *ప్రభుత్వ పాఠశాల టీచర్స్ ఉష, సుందరి, అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి బాయ్, ఆర్ పి కావేరి, 2ఇంక్లైన్ మాజీ సర్పంచ్ నగేష్, బానోతు చందర్, భూక్య హాసిలి, గ్రామ పెద్దలు అమ్ములు, రంగమ్మ, కిష్ట ,జోదియా, మూడు రమేష్, బాబు సింగ్, లక్ష్మణ్, రాంప్రసాద్, పద్మ ,ఈశ్వరి, మంగమ్మ,పిల్లలు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Helping students on the occasion of daughter's birthday

You cannot copy content of this page