Let’s move to implement the promises given by the state government
2024 జూలై 22న తహశీల్దార్ ఆఫీసులు
29న కలెక్టరేట్స్ ముందు ప్రదర్శనలు, ధర్నాల కరపత్రం ఆవిష్కరణ
సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి
జూపాక శ్రీనివాస్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దర్నాలకు సంబంధించి కర పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది
ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ
రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ళు స్థలాలు, తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. వృద్దులవుతూ, తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి. పెండ్లిలయ్యి వేరుపడి అరుకుగా బతుకుతున్న పేద జీవులు వీటి కోసం అలమటిస్తున్నారు. కేసీఆర్ ఊరికు దూరంగా కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
ఎవరో ఒకరిద్దరికే అవి లభించాయి. అలానే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు లేక 10 సంవత్సరాల కేసీఆర్ నిరంకుశ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్గానాలు వేసింది. ఆరు గ్యారంటీలు, ఇంకా ఎన్నో హామీలు మానిఫెస్టోలో ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ g ప్రభుత్వం వచ్చి నెలలు పూర్తి కావస్తున్నది. ఇచ్చిన వాగ్దానాల అమలులో తాత్సారం కలిపిస్తున్నది.
రైతుల, వ్యవసాయ కార్మికుల, విద్యార్థుల, యువజనుల, మహిళల తదితర అన్ని వర్గాల ప్రజలు సమస్యలు అనేకం పున్నాయి. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి రక్షించడానికి ఎం.ఎస్.పి కోసం కేంద్రంతో కొట్లాడటంతో పాటు, అన్ని రకాల పంటలకు బోనస్ వున్నది పాత, కొత్త రుణాలు మాఫీ చేయడంతోపాటు కొత్త రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్మికుల కోసం చట్టం అమలు చేయాలి. వారికిస్తానన్న 12 వేల పెన్షన్ కూడా అమలు చేయలేదు. నిరుద్యోగ ఖాళీలన్నింటిపై శ్వేతపత్రం ప్రకటించి వారికి కా క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలి.
విద్యార్థుల స్యాల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు సంబరాల తరబడి పెండింగ్లో వున్నాయి. వాటిని విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గ్రామ పంచాయితీల పనులకు బిల్లులు విడుదల చేయక పోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఆరోగ్యశ్రీ బిల్లులు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పోడు భూముల సమస్య పూర్తిగా పరస్కారం కాలేదు. ధరణి సమస్యలు రైతులను ఇంకా వేధిస్తున్నాయి. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణమే పూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ డిమాండ్ల సాధన కోసం సీపీఐ (ఎం.ఎల్.)మాస్ (ప్రజా పంథా) రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి ఆందోళనలు నిర్వహించాలని భావించింది. ఈ డిమాండ్ల సాధన కోసం 20124 జూలై 22వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ముందు ఫర్నాలు, ప్రదర్శనలు, జూలై 29వ తేదీన కలెక్టరేట్స్ ముందు ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని నిర్ణయించింది. వీటిలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న,జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, పెండ్యాల రమేష్, కోడిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, తీగుట్ల రాములు, దేవన్న సమయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App