జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 04 at 15.17.50

TRINETHRAM NEWS

Alluri Sitharamaraju’s birthday is celebrated in the task force

Trinethram News : ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు కార్యాలయంలో గురువారం అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అల్లూరి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. తరువాత ఆయన మాట్లాడుతూ అన్యాయం, దోపిడీలపై అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని అన్నారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు యువతరానికి స్పూర్తినిస్తాయని తెలిపారు. అల్లూరి పోరాట స్పూర్తితో టాస్క్ ఫోర్సు పోలీసులు పని చేయాలని, అడవుల్లోకి చొరబడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు మురళీకృష్ణ, ప్రేమ, ఆర్ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొని అల్లూరికి నివాళులర్పించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alluri Sitharamaraju's birthday is celebrated in the task force

You cannot copy content of this page