Effigy of Rahul Gandhi : హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

TRINETHRAM NEWS

Effigy of Rahul Gandhi who made inappropriate comments on Hindus was burnt

మంథని పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భారతదేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ తన బాధ్యతను మరిచిపోయి హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకర రీతిలో మాట్లాడడం జరిగింది.ఎవరినైతే హిందువులని అంటారో వాళ్లు హింసావాదులనీ ,అసత్యపరులని ,అధర్మపరులని అన్నాడు ఈ పదాలు భారతదేశ పార్లమెంటులో వాడడం రాహుల్ గాంధీ కి హిందువులపై ఉన్న అసలైన అభిప్రాయంగా భావించడం జరుగుతుంది.

మరి వీరి ఇండియా కూటమిలో ఉన్న ఉదయ నిధి స్టాలిన్ గతంలో ఈ దేశం నుండి సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని అన్న అతని మూర్ఖపు మాటలను మరవకముందే పార్లమెంటులో రాహుల్ గాంధీ హిందువులపై విషంగక్కడం దేనికి సంకేతంగా భావించాలో ప్రతి భారతీయుడు వారి మనోగతాలను గ్రహించాలని మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ కోరారు.రాహుల్ గాంధీ వెంటనే యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్ బిజెపి నాయకులు చిలువేరు సతీష్ ,లక్ష్మణ్ ఎడ్ల సాగర్ విష్ణు సామల అశోక్ మురళీకృష్ణ ప్రభాకర్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Effigy of Rahul Gandhi who made inappropriate comments on Hindus was burnt

You cannot copy content of this page

Scroll to Top