What are the measures taken against the soil mafia who violated the rules of soil looting in Pedpadalli district?
మట్టి మాఫియాకు అమ్ముడు పోయిన సంబంధించిన ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వానికి వచ్చె ఆదాయాన్ని గండి కొడుతున్న సంబధిత అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలో నిబంధనలు కాలరాస్తున్న మట్టి మాఫియాకు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం అండగా నిల్చిందని అందరు కలిసి సహజవనరలను దోచుకొని అర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ రామగుండం మండలం మూర్మూర్ గ్రామంలో ప్రక్కన ఆన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద ఉన్న ప్రాజెక్ట్ మట్టి తీసుకునే అనుమతి లేనప్పటికీ నిబంధనలకు విరుద్దంగ అధికారులతో లోపాయికారి ఒప్పందంతో ఇటుకబట్టి యాజమాన్యాలతో మట్టి మాఫీయాలతో అధికార యంత్రాంగం కుమ్మక్కై కొంత మెరకు రాయల్టీ కట్టి కొండంత మట్టి థవ్వుకొని మట్టిని దోచుకున్నారని మట్టి మాఫీయా చేసిన వారి పై పీడి యాక్ట్ అమలు చేయాలని అదే విధంగా వారికి సహకరించిన అధికారాలను సస్పెండ్ చేయాలని అన్నారు.
ఒక్క మీటర్ లోపు మాత్రమే అనుమతులు ఇస్తారని కాని 5 నుండి 6 మీటర్ల లోపు తవ్వుకోని పోయారని నల్ల మట్టి (BLOCK COTTON SOIL)
నీళ్లను ఇనుకనివ్వదని అంత లోతు తీసి మిషిన్ మునిగెంత వరకు లోపలికి దించి తవ్వరని అందినకాడికి దండుకపోయారని దానితో కాసుల వర్షం కురిపించుకున్నారని విమర్శించారు.
60 వేల మెట్రిక్ టన్నులు అనుమతులు తీసుకుంటే 1,80,000 మెట్రిక్ టన్నుల మట్టి తీసిన మట్టి మాఫీయా, వివిధ ఇటుక బట్టిల యాజమాన్యాలకు తరలించారని,
అనుమతులు తీసుకుంటే సంబంధించిన శాఖఅధికారులు పర్యవేక్షణ ఉంటుంది కానీ ఇక్కడ మట్టి మాఫీయా వారిదే చలమని అంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనింగ్ యాక్ట్ ప్రకారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు మాత్రమే అనుమతులు ఉంటాయి కానీ ఇక్కడ నిరంతర ప్రక్రియగా 24 గంటలు మట్టిని తీసారని ఇరిగేషన్, మైనింగ్, అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది.
కేవలం ఈ మట్టి ద్వారా 12 లక్షల రాయల్టీని కట్టి నాలుగు కోట్ల 50 లక్షల వరకు ఎక్సెస్ చేశారని అన్నారు. నూతన జిల్లా కలెక్టర్ గారు మరియు మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్పందించి (ఈటిఎస్) ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ప్రజల సమక్షంలో సర్వే చేయించి లోతుగా తీసిన మట్టిలో యుద్ధ ప్రాతిపదికన మట్టిని నింపాలని ప్రకృతి సంపదను కాపాడాలని చెరువుల అస్తిత్వాన్ని కాపాడగలరని మా వంతుగా మీకు తెలియజేస్తున్నము.
అలాగే పెద్దపల్లి జిల్లాలోని బండ్ల వాగు తక్కలపల్లి, అల్లూరు, బిట్టుపల్లిలో ఇదే తంతుగా పరిమితి మించి జరగుతున్న పట్టించుకునే అధికారులు జిల్లాలో కనపడటం లేదని విజిలెన్స్ విచారణ జరిగిందని సమాచారం ఉందని, కావున అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సహజ వనరులను దోచుకుంటున్న మట్టి మాఫీయా పై మరియు ఇటుక బట్టుల యాజమాన్యాల పై పీ డి యాక్ట్ అమలు చేయాలని, వారికి సహకరిస్తున్న కొంతమంది సంబంధించిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, అవినితి అధికారల పై సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టించే విధంగా ప్రయత్నం చేసిన వారిని సస్పెండ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గారిని కోరమని మద్దెల దినేష్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App