జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 28 at 3.10.25 PM

TRINETHRAM NEWS

Congress party in-charge Kolan Hanmant Reddy stands by the people of Qutbullapur constituency

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 130 డివిజన్ సుభాష్ నగర్ ఉషోదయ టవర్స్
నివస్తులైన సత్యనారాయణ కొడుకు సుదీప్ గత కొన్నిరోజులుగా గుండె అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేకపోవటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- రూ . సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను సత్యనారాయణ కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ రషీద్, సిద్దయ్య, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, గాదె వినోద్, ఎండీ రజాక్, అమెర్, దినేష్, సంపంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party in-charge Kolan Hanmant Reddy stands by the people of Qutbullapur constituency

You cannot copy content of this page