TRINETHRAM NEWS

After 90 years this is the rain in Delhi

Trinethram News : June 28, 2024

న్యూఢిల్లీ : వర్ష బీభత్సం.. కుండపోత వాన అంటే ఎలా ఉంటుందో.. ఎంత భయంకరంగా ఉంటుందో ఢిల్లీ జనం కళ్లారా చూశారు. 2024, జూన్ 25వ తేదీ అర్థరాత్రి పడిన వర్షం.. రికార్డులను బద్దలు కొట్టింది. 1936లో ఒకే రోజు ఇంత వర్షం పడింది.. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ రిపీట్ అయ్యింది ఢిల్లీలో. జస్ట్ మూడు అంటే మూడు గంటల్లో 15 సెంటిమీటర్ల వర్షం.. 24 గంటల్లో 24 సెంటిమీటర్ల వాన పడింది. మూడు గంటల్లో 15 సెంటిమీటర్లు అంటే కుండపోత వాన.. ఏకధాటిగా పడిన కుండపోత వానతో ఢిల్లీ జలమయం అయ్యింది.

90 ఏళ్ల క్రితం ఇంత వర్షం పడినా.. అప్పట్లో ఇంత కాంక్రీట్ నిర్మాణాలు లేవు.. సో.. అప్పటి వర్షానికి పెద్దగా డ్యామేజీ అంటూ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఢిల్లీ అంటే కాంక్రీట్ జంగిల్. దీంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్ల పక్కన గోతులు ఏర్పడ్డాయి. రోడ్లపై ఉన్న సబ్ వేలు మునిగిపోయాయి. కార్లు, బైకుల్లో నీళ్లల్లో మునిగాయి. చెట్లు కూలాయి.. రోడ్లు కొట్టుకుపోయాయి.. సింపుల్ గా చెప్పాలంటే ఢిల్లీ అల్లకల్లోలం.. అతాలాకుతలం అయ్యింది.

జనానికి నిద్ర లేదు. ఇంట్లో నీళ్లు.. ఇంటి బయట నీళ్లు.. అంతా తడిసి ముద్ద అయ్యింది. వేలాది వాహనాలు నీళ్లలో మునగటం.. చెట్లు కూలి డ్యామేజ్ కావటం జరిగింది. కరెంట్ సరఫరా బంద్ అయ్యింది. మంచి నీళ్లు సరఫరా లేదు.. దీంతో ఢిల్లీ జనం అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో వర్షం తగ్గినా.. వాటర్ లాగిన్స్ తో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

ఢిల్లీలో కుండపోత వర్షంపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దు చేసి.. విధుల్లో చేరాలని ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

After 90 years this is the rain in Delhi