జూలై 23, 2026

WhatsApp Image 2023 12 23 at 5.10.11 PM

TRINETHRAM NEWS

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మరియు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు… ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ముందుగా క్రైస్తవ సోదర సోదరీమనులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, దయ గలిగిన ఏసుక్రీస్తు ప్రభు భూమిమీదకు వచ్చిన పవిత్రమైన రోజును క్రిస్మస్ పండుగా జరుపుకుంటామని అన్నారు. ఆ ప్రభు యెక్క చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ మెండుగా ఉండేవిధంగా చూడాలని ఆ ఏసు క్రీస్తు ప్రభువు ను కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుని, సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దైవ జనులైన పాస్టర్ లకు దుస్తులు పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

You cannot copy content of this page