పెద్దపెల్లి, జూన్ -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని సంగీత సినిమా ధియేటర్ లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం జరిగిందని పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం అగ్నిమాపక శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని సంగీత సినిమా థియేటర్ నందు తనిఖీ నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించడం జరిగిందని, థియేటర్ లో ఉన్న అగ్నిమాపక సాధనాలను పరీక్షించి వాటి పని చేయు విధానం సిబ్బందికి తెలియజేశామని, ఎలక్ట్రికల్ ఫైర్ పై అవగాహన కల్పించామని అన్నారు.
సినిమా థియేటర్ లో పొగ త్రాగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని, ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవించినచో సిబ్బంది ఎలా స్పందించాలో వివరించామని, ఇసుక బకెట్ లలో 6 నెలలకు ఒకసారి పొడి ఇసుకను మార్చాలని ఆదేశించామని, ఫైర్ హైడ్రేంట్స్ కు సరిపడు నీరు ఉండేలా చూసుకోవాలని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైర్ మాన్ కె.శ్రీనివాస్, పి.నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App