Madipelli Mallesh showed humanity that caste and religion should not be a barrier to service
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన చాంద్ బి అనే 70 సంవత్సరాల వృద్ధురాలు చిన్న పూరి గుడిసె మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని నివసిస్తున్న విషయాన్ని గోదావరిఖనికి చెందిన ఉప్పల్ల శ్రీధర్ ద్వారా చంద్ బీ అమ్మ యొక్క పరిస్థితిని తెలుసుకున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ వెంటనే చంద్ బీ ఉంటున్నా ముబారక్ నగర్ వెళ్లి చాంద్ బీ అమ్మ గుడిసె పరిస్థితిని చూసి మడిపెల్లి మల్లేష్ 10 రోజుల్లో నూతన ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని అమ్మ కు మాట ఇచ్చి అనుకుంట్లుగా చంద్ బి అమ్మ కు మల్లేష్ యొక్క ఆత్మీయుల మరియు శ్రీ సీత రామ సేవా సమితి సబ్యుల అందరి సహకారంతో నూతన ఇల్లు నిర్మాణం పూర్తి చేసి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదగా శుక్రవారం రోజున గృహప్రవేశం చేయించి చంద్ బీ అమ్మకు నూతన ఇళ్లను అప్పగించారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలం నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు పేద ప్రజలకు తోడుగా ఉంటున్నానాని గతంలో కూడా పీకే రామయ్యా కాలనీలో కొడుకు కోడలు చనిపోయి ఎవరు లేక ఉండటానికి కూడా ఇల్లు లేక 13 సంవత్సరాల మనువరాలు తో చిన్న పందిరి కింద తలదాచుకుంటున్నా చంద్రమ్మ అనే అమ్మ కూడా నాఆత్మీయుల సహకారంతో.మరియు శ్రీ సీతా రామ సేవా సమితి సభ్యుల సహకారంతో నూతన ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగిందని చంద్ బీ అమ్మ ఇల్లు తో రెండోవ ఇల్లు నిర్మాణం చేశామని మల్లేష్ తెలిపారు నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటు నాకు సహాయ సహకారాలు అందిస్తున్న
నా ఆత్మీయుల అందరికీ
ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో 21 డివిజన్ కార్పొరేటర్ సలీమ్ బేగ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అసిఫ్ పాషా, మహమ్మద్,సోషల్ మీడియా నాయకులు ముళ్ళపూడి ప్రతాప్ రాజ్.దులికట్ట సతీష్,ఉప్పల్ల శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ రెండోవ డివిజన్ SC సెల్ అధ్యక్షులు పుల్లూరి నాగభూషణం, కుమారస్వామి, పెనుగొండ తిరుపతి,చిప్ప మల్లేష్, శ్రీ సీతారామ సేవాసమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ,కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కే రమాదేవి, మందల రమాదేవి, జీ సరిత,లక్ష్మీ, బి లత, పి చంద్రకళ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App