WhatsApp Image 2024 06 14 at 13.54.45
Ramagundam MLA Raj Thakur started the open gym at the stadium
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే నిధుల నుండి (CDF) దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించార
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,
గత ఎన్నికల వేళ స్టేడియంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడి వాకర్స్, సీనియర్ సిటిజన్, యువ క్రీడాకారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా,కిచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ది నిధుల నుండి (MLA FUNDS) దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని,
ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడం నా నైజమని,
ప్రజలందరి మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ది దిశగా మార్చేందుకు కృషి చేస్తూ, ఆరు (6) గ్యారంటీలను అమలుచేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తామని,
ఈ ఓపెన్ జిమ్ ను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు..
అనంతరం స్టేడియం వాకర్స్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శాలువాతో ఘనంగా సత్కరించారు..
అనంతరం స్టేడియంలోని వాకర్స్ , సీనియర్ సిటిజన్ మరియు యువక్రీడాకారులకు ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్ ఉడకబెట్టిన గుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,
నగర మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రముఖ న్యాయవాదులు, కార్పోరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, అధిక సంఖ్యలో వాకర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
