
Double Bedroom 660 Draw Beneficiaries have submitted a request form to Ramagundam Tehsildar for Double Bedroom
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మండల పరిధిలోని 660 మంది డ్రా పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక కాబడిన లబ్ధిదారులమైన మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయగలరని అభ్యర్థిస్తూ రామగుండం మండల తహశీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులతో భాగంగా రోడ్లు, డ్రైనీజీ,మంచి నీటి సౌకర్యం, విద్యుత్ మరమ్మత్తులు కొన్ని మిగిలి ఉన్న పనులను అతిత్వరలో పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
మేము రామగుండం నియోజక వర్గ పరిధిలో గల నిరుపేద కుటుంబాలకు చెందిన వారము దినసరి కూలీలుగా పనులు చేసుకుంటూ బ్రతుకులు వెళ్లదీస్తున్నాము. మాకు స్వంత స్థలం, ఇల్లు లేవు. ఏళ్ళు
తరబడి అద్దె ఇండ్లలో నివాసం ఉంటా కిరాయిలు చెల్లించలేక, కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము.
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా మేము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులతో పూర్తి స్థాయి
విచారణ జరిపి పేదలైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. కానీవేల సంఖ్యలో దరఖాస్తులు రావడం మూలంగా లబ్ధిదారులను డ్రా పద్ధతి
ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వము నిర్ణయించి తేది – 16-03-2023న స్థానిక G. M. కాలనీలోని సింగరేణి RG-I. కమ్యూనిటీ హాల్ నందు జిల్లా కలెక్టర్, పెద్దపల్లి, రామగుండం తహశీల్దార్ ఇతర సంబంధిత అధికారుల మరియు హాజరైన దరఖాస్తుదారుల సమక్షంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డ్రా తీసి 660 మంది లబ్ధిదారులమైన మమ్ములను ఎంపిక చేయడం జరిగింది.
ఈ ఎంపిక జరిగి దాదాపు ఏడాది పైగా కాలం గడుస్తున్నా ఇంత వరకు మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకుండా కాలయాపన
చేసినారు
ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా తమ ద్వారా మా 660 మంది నిరుపేద లబ్ధిదారులకు తప్పక న్యాయం చేయాలని, దయనీయమైన మా పరిస్థితులను పెద్దమనసుతో అర్థం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ కనబరిచి
సత్వరమే ఎంపిక కాబడిన మా 660 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించి పట్టాలు ఇప్పించ
వలసిందిగా గౌరవనీయులైన రామగుండం తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈరోజు 660 మంది లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో సహా సుమారుగా 1400 మంది రామగుండం మండల
తహశీల్దార్ కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
