National Media : చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్లు అవుతారా? జాతీయ మీడియాలో జోరుగా చర్చ

TRINETHRAM NEWS

Will Chandrababu and Nitish Kumar become king makers..? Loud discussion in national media

లోక్ సభ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళుతోంది.

ప్రారంభ ట్రెండ్స్ నాటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ మార్క్ ను దాటగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గట్టి పోటీనిస్తోంది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 292 సీట్లలో ఆధిక్యంలో ఉంది.. ఇండియా కూటమి 233 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఈ క్రమంలో జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఊహించని విధంగా అంచనాలను తారుమారు చేస్తూ.. కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో.. స్వాతంత్ర్య అభ్యర్థులు.. పలు ప్రాంతీయ పార్టీలతో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది..

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కింగ్ మేకర్లుగా మారుతారంటూ ఊహగానాలు వెలువడుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will Chandrababu and Nitish Kumar become king makers..? Loud discussion in national media

You cannot copy content of this page

Scroll to Top