జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 31 at 18.24.15

TRINETHRAM NEWS

Calmly concluded Inter Supplementary Main Examinations Intermediate District Officer Kalpana

పెద్దపల్లి, మే -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24 తేదీన ప్రారంభమై మే 31 తో ప్రధాన పరీక్షలు ముగిసాయని, జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయని తెలిపారు
శుక్రవారం ఉదయం జరిగిన మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, వాణిజ్య శాస్త్రం పరీక్షలు 1660 మంది, సాయంత్రం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 735 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, అదనపు
కలెక్టర్ లు, పోలీస్, వైద్య, ఆరోగ్య, పాఠశాల విద్య శాఖ అధికారులు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Calmly concluded Inter Supplementary Main Examinations Intermediate District Officer Kalpana

You cannot copy content of this page