TRINETHRAM NEWS

Young laborer dies in road accident due to negligence of Singareni management CITU

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కామ్రేడ్ భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

25న జీడీకే11, ఇంక్లైన్ లో జనరల్ మద్దూర్ యువ కార్మికుడు రసపెల్లి నాగరాజు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న అర్ధరాత్రి సమయంలో జీడీకే 1&3, 11, ఇంక్లైన్ మంథని రోడ్డు మార్గంలో, మూలమలుపులతో రోడ్డు లైటింగ్ లేక ఆగి ఉన్న లారీని ఢీకొని మరణించడం జరిగిందని, ఈరోజు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో అతని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ అర్జీ1, కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కార్మికులు కార్మిక సంఘాలు కొత్త రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నారని పాత రోడ్డును పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు, సింగరేణి యాజమాన్యం పాత రోడ్డును ప్రారంభించి కార్మికులకు వెసులుబాటు కల్పించినప్పటికీ అప్పుడప్పుడు రోడ్డు మరమత్తులు పేరుతోటి బందు చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన సింగరేణి యజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించి గని ప్రమాదంగా గుర్తించి అతనికి రావలసిన బెనిఫిట్స్ అన్ని కూడా సకాలంలో అందజేయాలని తక్షణమే పాత రోడ్డును ప్రారంభించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి, దాసరి సురేష్, వంగల శివరాం రెడ్డి, మునుకుంట్ల రామన్న, యు సందీప్, తదితరులు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Young laborer dies in road accident due to negligence of Singareni management CITU