TRINETHRAM NEWS

జగన్ తర్వాత ఇక మిధున్ రెడ్డే..!

వైసీపీలో కీలకంగా మారిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి..

టికెట్లు ఆశిస్తున్న నేతలు మిథున్ రెడ్డిని కలవాల్సిందిగా జగన్ సూచన…

ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతుండగా యువకుడైన మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత దగ్గరయ్యారు…

ప్రస్తుతం పార్టీలో నెంబర్‌ 2గా చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటివారు ఎందరో ఉన్నా.. వారెవరికీ అప్పగించని బాధ్యతలను ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ అప్పగించారు..

సిట్టింగుల్లో మార్చాలనుకుంటున్న ఎమ్మెల్యేలను నచ్చజెప్పి.. వారు పార్టీ లైన్‌ దాటకుండా చూసే బాధ్యతను మిథున్‌రెడ్డికే సీఎం జగన్.. అప్పగించారు

ఏ ఎమ్మెల్యేను ఎందుకు తప్పించాల్సి వస్తుందో.. ఎన్నికల తర్వాత వారికి ఎలాంటి ప్రాధాన్యం కల్పించనున్నారనే విషయాలను మిథున్‌రెడ్డే వారికి చేరవేస్తున్నారు.

ఇప్పటివరకు మార్పు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా అసంతృప్తి కనిపించకపోవడానికి.. తెరవెనుక మిథున్‌రెడ్డి నడిపిన మంత్రాంగమే కారణమనే ప్రచారం ఉంది.

మార్చుదామనునకున్న స్థానాల్లో ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడుతూ.. ధిక్కారం వినిపించే వారిని ఒంటరిని చేసే ప్లాన్‌ పక్కాగా అమలు చేయడం వల్ల ఇప్పటివరకు జగన్‌ మార్క్‌ మార్పు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది…