నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: మే 10
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది.

80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్ల కు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగియ నుంది. పోస్టల్ ఓటింగ్ కోసం 2.64 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

నిన్న 1.76 లక్షల మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ ఓటు వేశారు. 80 ఏళ్లు పైబడిన వారిలో ఇంటి నుంచి 21,651 మంది ఓటు వేసినట్లు అధికారులు వెల్లడించారు…

You cannot copy content of this page

Scroll to Top