WhatsApp Image 2024 03 28 at 4.09.40 PM
Trinethram News : Mar 28, 2024,
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని సీఐ ఫిర్యాదు చేయటంతో మేడిపల్లి పోలీసులు బండి సంజయ్ పై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది.
