WhatsApp Image 2024 03 28 at 3.31.34 PM
Trinethram News : అమెరికా ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ
అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ సహా వివిధ రాష్ట్రాల్లోని డైరీ ఫామ్ ఆవుల్లో, వాటి పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందన్న విషయం బయటపడింది.
దీంతో వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదముందని, ప్రజలకు అత్యంత చేరువగా వైరస్ వచ్చిందని సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
ఆ రాష్ట్రాల్లో వేలాది ఆవుల్లో H5N1 టైప్-A పాజిటివ్ వచ్చిందని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి.
