విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

TRINETHRAM NEWS

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

అలాగే ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్‌ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి.

You cannot copy content of this page

Scroll to Top