నిన్న జరిగిన యువ గళం ముగింపు సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కలమట

TRINETHRAM NEWS

నిన్న జరిగిన యువ గళం ముగింపు సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కలమట

నిన్న జరిగిన నారా లోకేష్ గారి చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో భాగంగా యువగలం – నవశకం బహిరంగ సభ కనీవిని ఎరిగిన రీతిలో 5 లక్ష పై పై చిలుకు జనాభ వచ్చి తెలుగు దేశం పార్టీ- జనసేన పార్టీ కలయికతో విజయవంతం అవడంతో ఈ వైకాపా నాయకులు ఈ సైకో పాలన పని అయిపోయిందని అన్నారు,

సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇంటికి బయలు దేరుతారని అలానే పాతపట్నం నియోజకవర్గం లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా తట్ట బుట్ట సద్దు కొని ఢిల్లీ ప్రయాణం అవ్వాలని అన్నారు.

నిన్న జరిగిన సభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఒకే వేదిక మీద చూడ్డాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

వైకాపా ప్రభుత్వం ఇంకా మూడు నెలలే ఉంటుందని జోష్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గెడ్డ వలస కమలాకర్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top