TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 18
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీ క్షలు జరుగుతాయి.

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తం గా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియ నుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు జరు గుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరప నున్నారు.

పేపర్ లీకేజీ వంటి అవాం చిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసు కురాకుండా నిషే ధించారు. 130 సమస్యా త్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తర గతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రా నికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ నంబర్‌ ప్రింట్‌ చేశారు.

ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసు కునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొ చ్చారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. హాల్ టిక్కెట్లు చూపి తే ఆర్టీసీ బస్సులో టెన్త్‌ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.