రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

TRINETHRAM NEWS

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..

మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం సృష్టించారు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు కార్లకు నిప్పు పెట్టారు రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలి వెళ్లారు అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.

You cannot copy content of this page

Scroll to Top