జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 14 at 08.26.22

TRINETHRAM NEWS

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.

లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 21వ తేదీ ఉదయం పదింటికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవల వర్చువల్‌ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

జూన్‌ 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం పదింటికి టికెట్లను అందుబాటులో ఉంచుతారు.

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.

25వ తేదీ ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

You cannot copy content of this page