నిరుపేద రైతు లకు ఆదుకోవటమే జగనన్న నైజం

TRINETHRAM NEWS

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ..

ఎన్నో ఎల్లుగా సాగు చేసుకుంటున్న భూమి పై ఎలాంటి హక్కు పత్రాలు లేక ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డామని, కాని ఇప్పుడు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మాకు హక్కు పత్రాలను పంపిణీ చేయటం ఎంతో సంతోషకరమని, మాకు ఇంత మేలు చేసిన ఎమ్మెల్యే

కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాను గ్రామ ప్రజలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలం లో అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసి నిరుపేద రైతులను ఆదుకోవటం జగనన్న ప్రభుత్వం తోనే సాధ్యం అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకొనే భూమి పై ఎలాంటి హక్కు పత్రాలకు లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయటం తో ఎంతటి కష్టం అయిన సరే వారికి తగిన న్యాయం చేయాలని చట్టసభల్లో మాట్లాడి, రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సన్నా చిన్న కారు రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేయాలనే ధృడ సంకల్పంతో పని చేసి నేడు పట్టాలను పంపిణీ చేసుకోవటం జరిగిందని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top