సిద్ధం సభల పేరిట సామాన్యులపై సీఎం జగన్ యుద్ధం ప‌్రకటించారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సభకు రాకపాతే పింఛన్లు ఆపుతామని, ప్రభుత్వ లబ్ధి కట్ చేస్తామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సభకు రాం అని చెప్పిన ప్రజలపై వైఎస్‌ఆర్సీపీ కార్యక్తలు దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు ఐదు కోట్ల ఆంధ్రులు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మేదరమెట్ల సిద్ధం సభలో జగన్‌రెడ్డి బేలతనం బయటపడిందని అన్నారు. దౌర్జన్యాలు, లిక్కర్ పంపిణీ.. ఎన్ని చేసినా జనం రావట్లేదనే జగన్ గ్రాఫిక్స్‌ను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ బోగోతం బయటపడుతుందనే మీడియాను స్వేచ్ఛగా సిద్ధం సభకు అనుమతించలేదని… సభకు రావద్దంటూ మీడియాకు నోటీసులు ఇచ్చినప్పుడే గ్రాఫిక్స్ నిజమనే విషయం ప్రజలకు అర్ధమైందన్నారు. సిద్ధం సభలో సొంత ఐప్యాక్ డ్రోన్ తిరిగినా జగన్ కంగారెత్తిపోయాడని.. జగన్ కంగారును గమనించే అంబటి రాంబాబు డ్రోన్‌ను నేలకూల్చమని సూచనలు చేశారని తెలిపారు. గ్రాఫిక్స్ పేరిట జనం చెవులో పూలు పెడదామనుకుంటే.. హడావుడిలో నిజాలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో జగన్‌రెడ్డి బేలతనం బయటపడిందని, అందుకే ఓడిపోయినా పథకాలు కొనసాగించాలని చెబుతున్నాడని వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా వైసీపీ నేతల జేబులు ఫుల్, పేదల కుటుంబాల్లో ఆనందం నిల్‌గా ఉందన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని, నేర పాలనలో ఐదు కోట్ల మంది బాధితులేనని.. వారంతా ఏకమయ్యేసరికి జగన్ భయపడుతున్నారని అన్నారు. ప్రజా ఆకాంక్ష మేరకే టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటైయ్యాయని, త్వరలోనే నియంత దోపిడీ పాలన అంతం కాబోతుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
సిద్ధం సభల పేరిట సామాన్యులపై జగన్ యుద్ధం: ప్రత్తిపాటి
Related Posts
DSC : నేడు డిఎస్సి సిలబస్ విడుదల
TRINETHRAM NEWS నేడు డిఎస్సి సిలబస్ విడుదల Trinethram News : Andhra Pradesh : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం…
Pawan : YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్
TRINETHRAM NEWS YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్ Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024, వైసీపీ ప్రభుత్వం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్…