TRINETHRAM NEWS

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగే తొలి భారీ బహిరంగ సభ లో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఆయనతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేనాని పవన్ కళ్యాణ్ ఇతర నేతలు పాల్గొననున్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ లు విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

అదే రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఈ సారి కూడా పై ముగ్గురు నేతలు రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు సుడిగాలి పర్యటనలు జరిపేందుకు నిర్ణయించారు.

అందులో భాగంగానే బీజేపీ తో పొత్తు కుదిరిన వెంటనే బాబు,పవన్ లు ఏపీ నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన పల్నాడుకు వస్తున్న ప్రధాన మంత్రుల్లో నరేంద్ర మోడీ 4వ వారు.

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంఖు స్థాపన కోసం వచ్చారు.

1980 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాచర్ల కేసీపీ గ్రౌండ్ లో జరిగిన సభకు హాజరయ్యారు.

1989 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ పిడుగురాళ్ల లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17 న రానున్నారు.

చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న 150 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని టీడీపీ,జనసేన నేతలు ఎంపిక చేశారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,ఇతర నేతలు ఈ ప్రాంతాన్ని పర్యటించి పై ప్రదేశాన్ని ఎంపిక చేశారు.

సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు మేదర మెట్ల లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న సిద్ధం సభకు మించి మోడీ,బాబు,పవన్ పాల్గొనే సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే జిల్లా నేతలందరూ ఈ సభ సక్సెస్ పై దృష్టి పెట్టారు.