జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 4.16.17 PM

TRINETHRAM NEWS

ఎమ్.ఎస్. రెడ్డి పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఏసుక్రీస్తు జీవితం భావితర పౌరులకు ఆదర్శనీయం

కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్

ఎమ్మెస్ రెడ్డి పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని 24 వ వార్డు చంద్రన్న కుంట లో గల ఎమ్మెస్ రెడ్డి పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీస్తు పుట్టిన జన్మదిన ప్రాముక్యాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరు శాంతి, కరుణ, దయ గుణంను ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకొని అలాంటి గుణం విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులతో కేక్ కట్ చేసి ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు శాంటా తాత వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వివిధ నృత్య ప్రదర్శనలతో ఏసుక్రీస్తు గొప్పతనాన్ని చూపించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజిని, డైరెక్టర్ స్వర్ణలత, ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page