WhatsApp Image 2024 03 09 at 11.54.34
Trinethram News : హైదరాబాద్:మార్చి 09
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు.
గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు.
గోపి గోడమీద పిల్లి, లక్ష్మీ పుత్రుడు వంటి సినిమాలకు రాంబాబు నిర్మాతగా వ్యవ హరించారు. గతంలో సీపీఎం పార్టీ అనుబంధ సంఘమైన ప్రజానాట్య మండలిలోనూ పనిచేశారు.
ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.
