జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 05 at 22.40.31

TRINETHRAM NEWS

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు.

ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగళవారం వెలుగు చూసింది. రౌడీషీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్ ఎస్ఐ టీ మాధవ్ గౌడ్.. వీ మహేందర్ గౌడ్ అనే రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు. జిల్లా పరిధిలోని అనేక పోలీసు స్టేషన్లలో మహేందర్ గౌడ్ పేరు మీద రౌడీషీట్ ఓపెన్ చేయబడింది. పోలీసు స్టేషన్లలోని నోటీసు బోర్డుల్లో కూడా మహేందర్ ఫొటోను ఉంచారు. రౌడీషీటర్ ఆగడాలు తెలిసినప్పటికీ.. ఎస్ఐ మాధవ్ బర్త్ డే వేడుకలు నిర్వహించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page