WhatsApp Image 2024 03 05 at 13.53.45
హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
ఈ పెట్టెను రూ .50 కోట్లకు అమ్ముడుపోయేలా ప్లాన్ చేసుకొని వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేస్తారనే సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో జనగామలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులులకి పెట్టెతో పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
