WhatsApp Image 2024 03 04 at 15.21.10
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్‌ను విచారించింది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్రయిస్తున్నారని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది.
మీరు మాట్లాడే మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాలని కోర్టు తెలిపింది.
