జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 02 at 20.14.08

TRINETHRAM NEWS

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పలువురు ముఖ్యనేతలతో కలిసి టీడీపీలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాదులోని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసానికి కృష్ణప్రసాదు, పలువురు మైలవరం నియోజకవర్గంలోని నేతలు వెళ్లారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే వసంతతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీలో చేరారు. వారందరినీ పేరు పేరునా పిలిచి, చంద్రబాబునాయుడు కి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పరిచయం చేశారు.

*_ఎమ్మెల

You cannot copy content of this page