TRINETHRAM NEWS

సభలో లెక్కాపత్రాలు

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభ

తొలుత మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం

అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా రాష్ట్రం అప్పులు,నీటిపారుదల, విద్యుత్‌ శాఖల పరిస్థితిపై వివరణ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రసంగించే అవకాశం

తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు హరీశ్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం మూడు రోజుల క్రితం వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి భేటీ కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (రామాయంపేట), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (పరిగి), కుంజ సత్యవతి (భద్రాచలం) మృతి పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చ కింద రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.

ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు ఉన్న అప్పులు, ఆ తర్వాత పదేళ్లలో చేసిన అప్పులు, పదేళ్ల బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ రాబడులు, ఖర్చు గురించి సాగునీరు, ఆర్‌అండ్