ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 01 at 19.40.06

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 01
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇంద్ర ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న ప్రధాని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమా లకు ప్రధానమంత్రి మోదీ భూమి పూజ చేయను న్నారు.

ఇందులో భాగంగా తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపాలని సూచించినట్లు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.

అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి లక్ష మందిని వివిధ వాహనాల్లో తరలిం చేందుకు ఆయా జిల్లాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

You cannot copy content of this page