జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 01 at 10.58.56

TRINETHRAM NEWS

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది…

తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారు.

గతంలో నేను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేశాం.
అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం..

తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది..

ఈ రోజున తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ప్రారంభించడం సంతోషంగా ఉంది…

ఇక్కడ ప్రతి రోజూఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది…

You cannot copy content of this page