WhatsApp Image 2024 02 22 at 2.26.56 PM
హైదరాబాద్: పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, జూనియర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు TSPSC తెలిపింది. ఈ ఉద్యోగాలకు గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
