సర్వే నెంబర్ 12 ఇప్పుడు సర్వే నెంబర్ 445 ఎలా అయ్యింది

TRINETHRAM NEWS

సర్వే నెంబర్ 12 ఇప్పుడు సర్వే నెంబర్ 445 ఎలా అయ్యింది.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

గత అక్టోబర్ 5 నెలలో రెవెన్యూ అధికారి రజినీకాంత్ తమ సిబ్బందితో కలిసి గాజులరామరం లో సర్వే నెంబర్ 12 లో ఇది ప్రభుత్వ భూమి అని హద్దులు పాతితే దాన్ని తొలగించి ఇప్పుడు సర్వే నెంబర్ 445 అని ఏకంగా ఒక డబ్బాను వేసి అంత బహిరంగంగా రాసి పెట్టడం,దాన్ని రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే అన్ని సర్వే నంబర్లు మార్చి అధికారుల తప్పుగా చిత్రీకరించి మొత్తం ప్రభుత్వ భూమినే ఆక్రమిస్తారని వెంటనే వాటిని కూల్చివేసి స్థలంను స్వాధీన పర్చుకోవాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top