WhatsApp Image 2024 02 21 at 16.43.47
Trinethram News : హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పిడమర్తి ఆధ్వర్యంలో నాయకులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి..యాత్ర గురించి వివరించారు. మాదిగల పంతం..కేంద్రంలో బీ జే పీ అంతమని తెలిపారు. కేంద్రం మాదిగలను విస్మరిస్తోందని, మాదిగ జాతిని మేలుకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా..మంత్రి పొంగులేటి స్పందిస్తూ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక చైర్మన్ ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్, నరేష్ పాల్గొన్నారు.
