ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 19 at 17.21.26

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు.

బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి సోనూసూద్ సోమ‌వారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు.

పంజాబ్ కు చెందిన వ్యక్తినయినా బాలీవుడ్ సినిమాలు చేయకున్నా.. తెలుగులో సినిమాలు చేశానని చెప్పారు సోనూ సూద్. తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్త న్నారు.

తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుభందం ఉంద న్నారు .ఈ రోజు శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు.

ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు. సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు.

You cannot copy content of this page