జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 17 at 17.59.27

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల:- అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేలా సొసైటీ సభ్యులు కృషి చేయాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానా నందు బాపట్ల అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 11 సభ్యులతో ఉన్న కమిటీల 29 మంది అభ్యర్థులకు పట్టణ సీఐ అనేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పోలింగ్,సాయంత్రం కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ ఎటువంటి వివాదాలకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. చిన్నపాటి వివాదం జరిగిన సహించేది లేదని కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు.ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సోదరులందరూ పోలీసులకు సహకరించి ఎన్నిక జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page