WhatsApp Image 2024 02 14 at 11.55.11
Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో 191 ఎన్టీఆర్ శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ మంజునాథ్, ప్రెసిడెంట్ పూర్ణ,191 ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ, కాలనీ వాసులు కొండా బాబు, చారీ,రాజు, లక్ష్మణ్, సతీష్, దుర్గ ప్రసాద్,ఆనంద్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి, 191 ఎన్టీఆర్ నగర్ శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
