ఏపీలో పలువురు ఏఐఎస్ అధికారుల బదిలీ

TRINETHRAM NEWS

అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు..

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను సుమిత్ కుమార్‌ను నియమించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జి వీర పాండ్యన్‌ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారి రాహూల్ పాండేను జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి..

You cannot copy content of this page

Scroll to Top